''U Turn''యూటర్న్ సినిమా రివ్యూ

u turn movie review
u turn movie review
u turn movie review :- సమంత లీడ్ రోల్‌లో మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘యూటర్న్’ సినిమా వినాయక చవితి పండగ నాడు సెప్టెంబర్ 13 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘యూటర్న్’ మూవీని తెలుగులో అదే పేరుతో ఒరిజినల్ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వ  వహించారు . ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో స‌మంత, ఆది పినిశెట్టి కీల‌క‌పాత్రల్లో న‌టించారు. సమంత జర్నలిస్ట్‌గా కనిపించారు. ఆది పినిశెట్టి ఇన్వెస్టిగేషన్ అఫీసర్‌గా నటించారు. భూమిక, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు.


యు టర్న్ సినిమా కథ 

రచన ఓ ఇంగ్లీష్ దినపత్రికలో పనిచేసే ట్రైనీ రిపోర్టర్. అదే ఆఫీస్‌లో పనిచేసే ఆదిత్య (రాహుల్ రవీంద్రన్), రచనకు ఒకరంటే మరొకరి ఇష్టం. ఈ క్రమంలో రోడ్డుపై డివైడర్‌ను తొలగించి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారంతా చనిపోతుంటారు. ఆ కోణంలో పరిశోధన చేస్తున్న క్రమంలో రచన ఓ మరణం కేసులో అడ్డంగా ఇరుక్కుపోతుది. దాంతో సాఫీగా సాగిపోతున్న జీవితం పోలీసుల మధ్య నలిగిపోతుంది. ఈ వ్యవహారంలో అండగా నిలిచిన నాయక్ (ఆది పినిశెట్టి)కు సస్పెండ్ అవుతాడు.

ఈ కేసులో రచన ఇచ్చిన సమాచారం మేరకు విస్తుపోయే నిజాల్ని తెలుసుకుంటాడు ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ నాయక్ (ఆది పినిశెట్టి). ఫ్లై ఓవర్‌పై యూటర్న్ తీసుకున్న వాళ్ల వివరాలు, ఫోన్ నంబర్లు ఉంచిన డైరీని నాయక్‌కి అందచేస్తుంది రచన. అయితే ఆ డైరీలో ఉన్న పదిమంది అప్పటికే చనిపోయి ఉండటం.. అన్నీ ఆత్మహత్యలుగా పోలీసు రికార్డుల్లో ఉండటం, సుందరం కూడా అదే రీతిలో ఆత్మహత్య చేసుకోవడం.. ఇలా ఆర్కేపురం ఫ్లైఓవ‌ర్‌‌పై రాంగ్ రూట్‌లో ‘యూటర్న్’ తీసుకున్న వాళ్ల మర్డర్ మిస్టరీని ఛేదించే పనిలో పడతారు రచన, నాయక్‌లు.

ఇంతకీ ‘యూటర్న్’ తీసుకున్న వాళ్ల నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా చంపారు? అర్చనకు ఈ హత్యలకు ఆ యూటర్న్‌కి సంబంధం ఏంటి? మాయ ఎలా చనిపోయింది? లాంటి విషయాలు తెరపై చూడాల్సిందే.

ప్లస్‌ పాయింట్స్ :

సమంత అక్కినేని, ఆది పినిశెట్టి ఫెర్ఫార్మెన్స్

సినిమాటోగ్రఫీ

రిరీకార్డింగ్

మైనస్ పాయింట్స్ :

డబ్బింగ్ వర్క్

డైలాగ్స్ పార్ట్

ఎమోషనల్‌

0/Post a Comment/Comments

Previous Post Next Post